Manchu Lakshmi: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మి సూచన

Manchu Lakshmi advice to TS Govt
  • టీచ్ ఫర్ ఛేంజ్ ట్రస్ట్ ద్వారా పలు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న మంచు లక్ష్మి
  • డ్రాపౌట్స్ తగ్గింపు, విద్యా ప్రమాణాల మెరుగు కోసం కృషి చేస్తున్న వైనం
  • డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనలైజింగ్ పై దృష్టి సారించాలని విన్నపం
డిజిటల్ విద్యాబోధన విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై సినీ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి  ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో అమలవుతున్న 'మన ఊరు మన బడి' కార్యక్రమం చాలా బాగుందని అన్నారు. టీచ్ ఫర్ ఛేంజ్ అనే ట్రస్ట్ ద్వారా పలు ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు ఏడేళ్లుగా ఆమె ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గించి, విద్యా ప్రమాణాల మెరుగు కోసం ఆమె కృషి చేస్తున్నారు.

ఈ అనుభవంతో తెలంగాణ ప్రభుత్వానికి ఆమె ఒక సూచన చేశారు. డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనలైజింగ్ పై దృష్టి సారించాలని ఆమె విన్నపం చేశారు. ఈ పద్ధతి వల్ల రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. అందువల్ల దీనిపై దృష్టి పెట్టాలని మంచు లక్ష్మి కోరారు.
Manchu Lakshmi
Tollywood
Telangana
Government

More Telugu News