కొరటాలతో ఎన్టీఆర్ సినిమాకి రంగం సిద్ధం!

22-01-2022 Sat 17:11
  • కొరటాలతో 'జనతా గ్యారేజ్' చేసిన ఎన్టీఆర్
  • ఆ సినిమాతో సొంతమైన భారీ హిట్
  • మరో ప్రాజెక్టుతో త్వరలో సెట్స్ పైకి
  • కెరియర్ పరంగా ఎన్టీఆర్ కి 30వ సినిమా  
Ntr in Koratala movie
ఎన్టీఆర్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం ఆయన మూడేళ్ల సమయాన్ని కేటాయించాడు. ఈ కారణంగానే ఆయన 'అరవింద సమేత' తరువాత మరో సినిమా చేయలేదు. అందువలన ఇకపై పెద్దగా గ్యాప్ లేకుండా మళ్లీ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేవిధంగా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడట.

అందులో భాగంగానే సాధ్యమైనంత త్వరగా కొరటాల సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఆయన తొందరపడుతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక వచ్చేనెల ఫస్టువీక్ లో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయని అంటున్నారు. కెరియర్ పరంగా ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా.

ఇక ఈ సినిమాలో కథానాయికలుగా జాన్వీ కపూర్ .. అలియా భట్ .. కీర్తి సురేశ్ .. రష్మిక పేర్లు వినిపించాయి. మరి వీరిలో ఎవరిని తీసుకుంటారనేది ఈ సినిమాను లాంచ్ చేసే రోజున తెలియవచ్చు. 'జనతా గ్యారేజ్' తరువాత కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అందరిలోను ఆసక్తి ఉంది.