బాంబే హైకోర్టు జడ్జి చాంబర్లో పాము కలకలం

22-01-2022 Sat 16:44
  • బాంబే హైకోర్టులో ఆరడుగుల పాము
  • గ్రౌండ్ ఫ్లోర్ లో జస్టిస్ అమిత్ బోర్కర్ చాంబర్
  • పామును చూసి హడలిపోయిన కోర్టు సిబ్బంది
  • పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్స్
Snake in Bombay High Court Judge Chamber
కేసుల విచారణతో ఎంతో బిజీగా ఉండే బాంబే హైకోర్టులో పాము కలకలం రేగింది. ఓ జడ్జి చాంబర్లో ఆరడుగుల పాము ప్రవేశించడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. జస్టిస్ అమిత్ బోర్కర్ చాంబర్లో ఈ పాము దర్శనమిచ్చింది. ఆయన చాంబర్ బాంబే హైకోర్టు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. ఎంతో పొడవుగా ఉన్న ఈ పామును చూసి కోర్టు సిబ్బంది హడలిపోయారు. వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించడంతో, వారు ఎంతో చాకచక్యంగా పామును పట్టుకున్నారు.

అయితే ఆ పాము విషపూరితమో, సాధారణ సర్పమో తెలియరాలేదు. చాలామంది ఆ పామును తమ ఫోన్ కెమెరాలతో క్లిక్ మనిపించారు. కాగా ఆ పామును జనవాసాలకు దూరంగా విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.