ఏపీలో కొత్తగా 12,926 కరోనా పాజిటివ్ కేసుల నమోదు

22-01-2022 Sat 16:24
  • గత 24 గంటల్లో 43,763 కరోనా టెస్టులు
  • విశాఖ జిల్లాలో 1,959 కొత్త కేసులు
  • చిత్తూరు జిల్లాలో 1,566 కేసులు
  • రాష్ట్రంలో ఆరుగురి మృతి
  • 73 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
Andhra Pradesh corona update
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 43,763 శాంపిల్స్ పరీక్షించగా 12,926 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో 1,959 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,566 కేసులు, అనంతపురం జిల్లాలో 1,379 కేసులు, గుంటూరు జిల్లాలో 1,212 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,001 కేసులు వెల్లడయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ భారీగా కొత్త కేసులు గుర్తించారు.

అదే సమయంలో 3,913 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,538కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,66,194 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,78,513 మంది ఆరోగ్యవంతులయ్యారు. చికిత్స పొందుతున్న వారి సంఖ్య 73,143కి పెరిగింది.