ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ!

22-01-2022 Sat 16:00
  • అనంతపురం జేసీగా కేతన్ గార్గ్
  • గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ గా నిశాంత్ కుమార్
  • ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ గా హిమాన్షు కౌశిక్
AP govt transfers 3 IAS officers
ముగ్గురు ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతపురం జాయింట్ కలెక్టర్ గా కేతన్ గార్గ్ ను బదిలీ చేసింది. ప్రస్తుతం ఈయన రాజంపేట సబ్ కలెక్టర్ గా ఉన్నారు. గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ గా నిశాంత్ కుమార్ ను ట్రాన్స్ ఫర్ చేసింది. ప్రస్తుతం ఈయన అనంతపురం జాయింట్ కలెక్టర్ గా ఉన్నారు. ఇక ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ గా హిమాన్షు కౌశిక్ ను నియమించింది. హిమాన్షు కౌశిక్ ప్రస్తుతం శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ గా ఉన్నారు. ఈ మేరకు ఈరోజు ఏపీ చీఫ్ సెక్రటరీ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.