Raghu Rama Krishna Raju: అనర్హత వేటు వేయించలేమని ఒప్పుకోండి... తక్షణమే రాజీనామా చేస్తా: రఘురామకృష్ణరాజు

  • కొంతకాలంగా రఘురామ, వైసీపీ మధ్య పోరు
  • అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ప్రయత్నాలు
  • ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నానన్న రఘురామ
Raghurama challenges YCP leaders

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పార్లమెంటులో అనర్హత వేటు వేయించాలని వైసీపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తుండడం తెలిసిందే. దీనిపై రఘురామ స్పందించారు. నాపై అనర్హత వేటు వేయించలేమని ఒప్పుకోండి... ఇప్పటికిప్పుడు పదవికి రాజీనామా చేస్తాను అంటూ సవాల్ విసిరారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నానని డెడ్ లైన్ విధించారు.

తాను ఢిల్లీలో ఉంటే పారిపోయానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. గత రెండున్నర సంవత్సరాలుగా జగన్ కోర్టుకే రావడం లేదని, దీనిపై ఏమంటారని ప్రశ్నించారు. కాగా, బీజేపీ ఎంపీ బండి సంజయ్ విషయంలో ఒకలా వ్యవహరిస్తున్న పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ, తన విషయంలో మరోలా వ్యవహరిస్తోందని ప్రజలు భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

More Telugu News