సీఎం యోగిపై బ్రాహ్మణ అభ్యర్థిని పోటీలో నిలపనున్న ఎస్పీ!

22-01-2022 Sat 14:18
  • ఎస్పీలో చేరిన బీజేపీ దివంగత నేత భార్య సుభావతి
  • గోరఖ్ పూర్ లో యోగిపై ఆమెను పోటీ చేయించే అవకాశం
  • యోగిపై పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన భీంఆర్మీ చీఫ్
SP to put Brahmin candidate against Yogi
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని నిలిపేందుకు సమాజ్ వాదీ పార్టీ సిద్ధమవుతోంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న దివంగత ఉపేంద్ర దత్ శుక్లా భార్య సుభావతి శుక్లా... యోగిపై పోటీ చేసే అవకాశం ఉంది. తన ఇద్దరు కుమారులతో కలిసి నిన్న ఆమె ఎస్పీలో చేరారు.

మరోవైపు యోగి నియోజకవర్గం గోరఖ్ పూర్ నుంచి పోటీ చేసేందుకు అనేక మంది ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ఇంకోవైపు యోగిపై పోటీ చేస్తానని భీంఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇప్పటికే ప్రకటించారు.