Virat Kohli: పంత్ చితగ్గొట్టుడు.. స్టాండ్స్ లో కోహ్లీ చిందులు.. ఇదిగో వీడియో

Kohli Dances For Pant Hitting
  • నిన్న జరిగిన వన్డేలో చెలరేగిన పంత్
  • డకౌట్ అయిన విరాట్ కోహ్లీ
  • పంత్ కొట్టిన సిక్స్ లకు డ్యాన్స్ చేసిన మాజీ కెప్టెన్
విరాట్ కోహ్లీ కెప్టెన్ కాకపోవచ్చు గాక.. రెండో వన్డేలో డకౌట్ అయి ఉండొచ్చుగాక.. కానీ, తన సహచరులు చితగ్గొడుతుంటే మాత్రం అతడిలోని చిన్నపిల్లాడు నిద్రలేస్తాడు. తోటి ఆటగాళ్లుకొట్టే ప్రతి షాట్ నూ ఎంజాయ్ చేస్తాడు. నిన్న జరిగిన రెండో వన్డేలోనూ అదే జరిగింది. రిషభ్ పంత్ చితగ్గొడుతుంటే.. స్టాండ్స్ లో కూర్చొని కోహ్లీ ఎంజాయ్ చేశాడు.

పంత్ సిక్స్ కొట్టినప్పుడల్లా చిందులేశాడు. కుర్చీలో కూర్చొనే చిరుమందహాసంతో చేతులు, ఒంటిని ఆడిస్తూ డ్యాన్స్ చేశాడు. కోహ్లీ డ్యాన్స్ చేస్తుంటే పక్కనే ఉన్న శిఖర్ ధవన్, లెగ్ స్పిన్నర్ చాహల్ కూడా నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అయింది.

కాగా, తొలి వన్డేలో కోహ్లీ 51 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రెండో వన్డేలో కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో కవర్ డ్రైవ్ ఆడపోయి ఫీల్డర్ కు చిక్కాడు. డకౌట్ అయ్యాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో పంత్ దే హయ్యెస్ట్ స్కోర్ కావడం విశేషం. 71 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. అందులో 3 సిక్సర్లున్నాయి.
Virat Kohli
Rishabh Pant
Cricket
Team India

More Telugu News