Mudragada Padmanabham: జగన్ గారూ.. ఓటీఎస్ వసూలు చేసే అధికారం మీకు ఎక్క‌డిది?: ముద్రగడ పద్మనాభం

Mudragada writes letter to Jagan
  • గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు మీరు ఓటీఎస్ ఎలా వసూలు చేస్తారు?
  • గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు
  • కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని మీకు.. ఓటీఎస్ వసూలు చేసే అధికారం ఎక్కడిది?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం తాజాగా బహిరంగ లేఖ రాశారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) పథకాన్ని తప్పుపడుతూ ఆయన ఈ లేఖ రాశారు. ఓటీఎస్ పేరుతో ప్రజలపై ఒత్తిడి తీసుకురావద్దని లేఖలో ఆయన కోరారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని... వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు కట్టించి ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం మీకెక్కడిదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ సమయంలో జరిగిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని మీకు... ఇప్పుడు ఓటీఎస్ పేరుతో డబ్బు వసూలు చేసే అధికారం ఎక్కడిదని ఆయన అడిగారు. 

  • Loading...

More Telugu News