SBI: రేపు ఎస్బీఐ ఆన్ లైన్ సేవలకు అంతరాయం

SBI online Services will be halted due to technical upgradation
షార్ట్స్‌లో చూడండి
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపు (జనవరి 22) సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ ప్రక్రియ చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఆన్ లైన్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచి జనవరి 22 ఉదయం 8.30 గంటల వరకు ఎస్బీఐ యోనో, యోనో లైట్, యూపీఐ, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, యోనో బిజినెస్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. టెక్నాలజీ అప్ గ్రేడేషన్ ప్రక్రియ చేపడుతున్నట్టు వివరించింది.
Go Back to Shorts
SBI
Online Services
Technical Upgradation
India

More Telugu News