తమిళనాడులో ఆదివారం లాక్ డౌన్... సీఎం స్టాలిన్ ప్రకటన

21-01-2022 Fri 20:29
  • తమిళనాడులో కరోనా ఉద్ధృతి
  • నిన్న ఒక్కరోజులో 28 వేలకు పైగా కొత్త కేసులు
  • శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు లాక్ డౌన్
  • ట్యాక్సీలు, ఆటోలకు మినహాయింపు
Tamilnadu CM Stalin announces complete lock down on Sunday
తమిళనాడులో కరోనా కొత్త కేసులు వెల్లువలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి 23) నాడు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించారు. లాక్ డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. అయితే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులకు వెళ్లే ట్యాక్సీలు, ఆటోలకు మినహాయింపు ఇచ్చారు. గురువారం ఒక్కరోజే తమిళనాడులో 28,561 కరోనా కేసులు నమోదయ్యాయి.