ఆర్ఆర్ఆర్ విడుదలకు రెండు తేదీలు ప్రకటించిన చిత్రబృందం

21-01-2022 Fri 19:00
  • ఈ నెల 7న రావాల్సిన ఆర్ఆర్ఆర్
  • కరోనా విజృంభణతో విడుదల వాయిదా
  • కరోనా పరిస్థితులు శాంతిస్తే విడుదల చేస్తామన్న డీవీవీ
  • మార్చి 18న రిలీజ్ చేస్తామని వెల్లడి
  • పరిస్థితులు అనుకూలించకపోతే ఏప్రిల్ 28న విడుదల
RRR unit announces release dates
ఈ నెల 7న విడుదల అవ్వాల్సిన ఆర్ఆర్ఆర్ చిత్రం కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రబృందం అభిమానులకు శుభవార్త చెప్పింది. విడుదలకు రెండు తేదీలు ప్రకటించింది. మార్చి 18న గానీ, ఏప్రిల్ 28న గానీ ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ వెల్లడించింది. దేశంలో కరోనా మహమ్మారి శాంతించి, అన్ని థియేటర్లు తెరుచుకుని పూర్తిసామర్థ్యంతో నడుస్తున్నప్పుడు తమ చిత్రాన్ని విడుదల చేస్తామని ఓ ప్రకటన చేసింది.

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ నటించారు. కీరవాణి సంగీతం అందించారు.