విలన్ గా మహేశ్ తో మళ్లీ తలపడనున్న గోపీచంద్!

21-01-2022 Fri 18:51
  • గతంలో విలన్ గా మెప్పించిన గోపీచంద్
  • ఆ తరువాత యాక్షన్ హీరోగా మంచి క్రేజ్
  • మహేశ్ తో సెట్స్ పైకి వెళ్లనున్న రాజమౌళి
  • ఆ సినిమాలో విలన్ గోపీచంద్ అంటూ ప్రచారం
Gopichand in Rajamouli movie
టాలీవుడ్ లో ఒకప్పుడు ముందుగా విలన్ పాత్రల్లో మెప్పించి, ఆ తరువాత హీరోగా మారిపోయి స్టార్ డమ్ ను అందుకున్నవారున్నారు. ఇక ఇప్పుడు హీరోలుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నవారిలో చాలామంది విలన్ వేషాలను వేయడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదు. ఆ జాబితాలో తాజాగా గోపీచంద్ పేరు కూడా వినిపిస్తోంది.

గోపీచంద్ తన కెరియర్ తొలినాళ్లలో విలన్ వేషాలతో మెప్పించాడు. ఆ తరువాత యాక్షన్ హీరోగా తన సత్తా చాటుకుని, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. అలాంటి గోపీచంద్ మళ్లీ పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నాడని అంటున్నారు .. అదీ రాజమౌళి సినిమాలో.

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం గోపీచంద్ ను సంప్రదిస్తున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. గతంలో మహేశ్ 'నిజం' సినిమాలో గోపీచంద్ విలన్ గా చేశాడు. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ కలవనుందని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.