రాణించిన పంత్, ఠాకూర్, రాహుల్... టీమిండియా భారీ స్కోరు

21-01-2022 Fri 18:30
  • టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో వన్డే
  • పార్ల్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • పంత్ ధనాధన్ ఇన్నింగ్స్
  • కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ
Team India posts huge total against South Africa in Paarl
దక్షిణాఫ్రికాతో పార్ల్ లో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 71 బంతుల్లోనే 85 పరుగులు సాధించాడు. పంత్ ధనాధన్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్ 55, శిఖర్ ధావన్ 29 పరుగులు చేశారు.

లోయరార్డర్ లో శార్దూల్ ఠాకూర్ 38 బంతుల్లో 40 పరుగులు, అశ్విన్ 25 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వెంకటేశ్ అయ్యర్ 22 పరుగులు సాధించాడు. కోహ్లీ (0), శ్రేయాస్ అయ్యర్ (11) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో తబ్రైజ్ షంసీ 2, మగాలా 1, మార్ క్రమ్ 1, కేశవ్ మహరాజ్ 1, ఫెహ్లుక్వాయో 1 వికెట్ తీశారు.