'స్టూవర్టుపురం దొంగ' పట్టాలెక్కడట!

21-01-2022 Fri 18:22
  • తెరపైకి 'టైగర్ నాగేశ్వర రావు' జీవితచరిత్ర
  • రవితేజ హీరోగా రంగంలోకి దిగనున్న వంశీ ఆకెళ్ల
  • అదే కథాంశంతో సెట్స్ పైకి వెళదామనుకున్న బెల్లంకొండ
  • ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా టాక్  
Stuvaartupuram Donga movie update
ఒకే కథావస్తువుతో రెండు సినిమాలు పట్టాలపైకి వెళ్లిన సందర్భాలు గతంలో చాలానే కనిపిస్తాయి. దర్శక నిర్మాతల మధ్య అవగాహన వలన ఎవరో ఒకరు డ్రాప్ అయితే, మరొకరు ముందుకు వెళ్లేవారు. ఎవరూ తగ్గకపోవడం వలన, రెండు సినిమాలు జనంలోకి వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు రవితేజ - బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల మధ్య అలాంటి పరిస్థితి తలెత్తుతుందేమోనని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రమాదం ఇప్పుడు తప్పిపోయినట్టేనని అంటున్నారు. 'టైగర్ నాగేశ్వరరావు' జీవితచరిత్రను అదే టైటిల్ తో చేయాలని రవితేజ అనుకున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో ఈ సినిమాను ప్రకటించారు .. పోస్టర్ ను కూడా వదిలారు.

ఇక అదే కథాంశంతో 'స్టూవర్టుపురం దొంగ' టైటిల్ తో చేయడానికి బెల్లంకొండ శ్రీనివాస్ రెడీ అయ్యాడు. కేఎస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు ప్రకటన వచ్చేసింది. టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు బరిలో నుంచి 'స్టూవర్టుపురం దొంగ'ను తప్పించాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.