ఏపీలో 13 వేలకు పైగా కరోనా రోజువారీ కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!

21-01-2022 Fri 17:54
  • ఏపీలో భారీగా కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 44,516 కరోనా పరీక్షలు
  • 13,212 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఐదుగురి మృతి
  • 64 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
Huge raise in corona daily cases in Andhra Pradesh
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 44,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ గా తేలింది. విశాఖ జిల్లాలో 2,244 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు, అనంతపురం జిల్లాలో 1,235 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులు, గుంటూరు జిల్లాలో 1,054 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,051 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,942 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,532కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,53,268 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,74,600 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ప్రస్తుతం 64,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి.