రెండు సినిమాలు లైన్లో పెట్టేసిన శ్రీకాంత్ తనయుడు!

21-01-2022 Fri 17:51
  • హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్
  • 'నిర్మలా కాన్వెంట్'తో తెరకి పరిచయం
  • 'పెళ్లి సందD'తో మంచి మార్కులు
  • త్వరలో సెట్స్ పైకి రెండు సినిమాలు  
Roshan in Ashwanidutt
ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ .. 'నిర్మల కాన్వెంట్' సినిమాతో టీనేజ్ లోనే తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని, 'పెళ్లి సందడి' సినిమాతో ఇటీవల ప్రేక్షకులను పలకరించాడు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమా, భారీ విజయాన్ని సాధించకపోయినా, కుర్రాడు పనికొస్తాడు అని ప్రేక్షకుల చేత అనిపించింది.

ఇక ఈ సినిమా తరువాత రెండు పెద్ద బ్యానర్లలోని సినిమాలను రోషన్ లైన్లో పెట్టాడు. వైజయంతీ మూవీస్ వారి బ్యానర్లో ఒక సినిమా చేయడానికి రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'జాతిరత్నాలు' మాదిరిగానే ఇది ఓ మాదిరి బడ్జెట్ తోనే నిర్మితమవుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా తరువాత రోషన్ 'సితార బ్యానర్లో మరో సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తయిందని అంటున్నారు. ఇక ఈ సినిమాలకి దర్శకులు ఎవరు? అనే విషయంతో పాటు మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.