'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఖరారు!

21-01-2022 Fri 17:26
  • కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో 'గుడ్ లక్ సఖి'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
  • ఈ నెల 28వ తేదీన విడుదల
Good Luck Sakhi Release Date Confirmed
కీర్తి సురేశ్ గ్రామీణ యువతిగా నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్ లక్ సఖి' సినిమా రూపొందింది. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ సినిమా, విడుదలకి ముస్తాబై చాలాకాలమే అయింది. అయితే సరైన విడుదల తేదీ దొరక్కపోవడం వలన ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఓటీటీలో విడుదలవుతుందనే టాక్ కూడా బలంగానే వినిపించింది.

ఈ నేపథ్యంలో థియేటర్లకు ఈ సినిమా వస్తుందనే విషయాన్ని స్పష్టం చేయడమే కాదు, రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. మొత్తానికి మరో వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందన్న మాట.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆ మధ్య వదిలిన సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాయిక నష్ట జాతకురాలు అనే టైపులో చూపిస్తూ సాగే ఈ పాట జనంలోకి బాగా వెళ్లింది. ఆది పినిశెట్టి .. జగపతిబాబు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇంతకాలం వెయిట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి..