కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: అచ్చెన్నాయుడు

21-01-2022 Fri 16:56
  • గుడివాడలో టీడీపీ నేతలపై దాడి దారుణం
  • గంజాయి బ్యాచ్ హత్య చేయించాలనుకుంది
  • కేసీనో గుట్టు బయటపడుతుందనే గుడివాడ గుట్కా బ్యాచ్ వీరంగం
Atchannaidu fires on Kodali Nani
గుడివాడలో టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడి దారుణమని అచ్చెన్నాయుడు అన్నారు. గంజాయి బ్యాచ్ టీడీపీ నేతలను హత్య చేసేందుకు యత్నించారని ఆరోపించారు. గుడివాడను ఇప్పటికే మట్కా, వ్యసనాలకు కేంద్రంగా మార్చేశారని... ఇప్పుడు కేసినో గుట్టు బయటపడుతుందనే భయంతో గుడివాడ గుట్కా బ్యాచ్ వీరంగం వేసిందని మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని కోడె త్రాచుగా మారారని... యువత జీవితాలను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రివర్గం నుంచి కొడాలిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.