టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ కు కరోనా

21-01-2022 Fri 16:45
  • టాలీవుడ్ లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించిన భాస్కర్   
  • కరోనాను సీరియస్ గా తీసుకోవాలని పిలుపు
Tollywood director Tharun Bhaskra tested corona positive
సినీ పరిశ్రమలో కరోనా కలకలం కొనసాగుతోంది. తాజాగా టాలీవుడ్ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కరోనా బారినపడ్డారు. కరోనా నిర్ధారణ టెస్టులో ఆయనకు పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా వచ్చిందంటూ తరుణ్ భాస్కర్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం ఐసోలేషన్ లో విశ్రాంతి తీసుకుంటున్నానని, కరోనాను సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్స్ అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ లోకి వెళ్లారు. వారిలో పలువురు కోలుకున్నారు.