వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు

21-01-2022 Fri 16:00
  • 427 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 139 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా నష్టపోయిన బజాజ్ ఫిన్ సర్వ్ షేరు విలువ
Markets ends straight fourth days
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయి 59,037కి పడిపోయింది. నిఫ్టీ 139 పాయింట్లు కోల్పోయి 17,617 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (2.68%), మారుతి సుజుకీ (1.80%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.02%), నెస్లే ఇండియా (0.95%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.73%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-5.37%), టెక్ మహీంద్రా (-4.44%), టాటా స్టీల్ (-3.18%), భారతి ఎయిర్ టెల్ (-2.83%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.77%).