2 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. కోహ్లీ డకౌట్!

21-01-2022 Fri 15:34
  • 18 ఓవర్లలో 90 పరుగులు చేసిన ఇండియా
  • తొలి వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన రాహుల్, ధావన్
  • 38 పరుగులతో ఆడుతున్న రాహుల్
Kohli duck out in 2nd ODI
పార్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఓపెనింగ్ కు దిగిన కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ మంచి ప్రారంభాన్ని అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ తరుణంలో 11.4 ఓవర్ల వద్ద ధావన్ మార్క్ రమ్ బౌలింగ్ లో మగాలాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ 5 బంతులను ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. మహరాజ్ బౌలింగ్ లో బవుమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం రాహుల్ కు రిషభ్ పంత్ జత కలిశాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 38 పరుగులు, పంత్ 15 పరుగులతో ఆడుతున్నారు.