Bonda Uma: గుడివాడలో ఉద్రిక్తత... టీడీపీ నేత బోండా ఉమ కారుపై రాళ్ల దాడి

Bonda Uma car damaged by YSRCP in Gudivada
  • కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ లో కేసినో నిర్వహించారంటూ వార్తలు
  • నిజ నిర్ధారణ కోసం గుడివాడ వెళ్లిన టీడీపీ నేతలు
  • టీడీపీ కార్యాలయంపై రాళ్లు రువ్విన వైసీపీ శ్రేణులు
కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో కేసినో నిర్వహించారంటూ వస్తున్న వార్తలు రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడకు వెళ్లింది.

ఈ నేపథ్యంలో కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో గుడివాడలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించారు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. అంతేకాదు టీడీపీ నేత బోండా ఉమ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
Bonda Uma
Telugudesam
Car
Damaged
YSRCP
Gudivada

More Telugu News