రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

21-01-2022 Fri 13:54
  • ఇప్పటికే తొలి వన్డే కోల్పోయిన టీమిండియా
  • ఈ వన్డేలో కూడా ఓడిపోతే సిరీస్ ను కోల్పోనున్న భారత్
  • మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉన్న సౌతాఫ్రికా
Team India won the toss and elected to bat in 2nd ODI
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ మ్యాచ్ ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఇండియా ఉంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది.

టీమిండియా తుది జట్టు:  కేఎల్ రాహుల్ (కెప్టెన్), బుమ్రా, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్, యజువేంద్ర చాహల్.
 
దక్షిణాఫ్రికా జట్టు: బవుమా (కెప్టెన్), డికాక్, మలాన్, మర్ క్రామ్, డుస్సేన్, డేవిడ్ మిల్లర్, ఫెలుక్వాయో, మగాలా, కేశవ్ మహరాజ్, షాంసీ, ఎన్గిడి.