ఆ స్పర్శ ఆహా.. అంటూ నాడు గుమ్మ‌డితో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన ప్ర‌కాశ్ రాజ్

21-01-2022 Fri 13:35
  • తీపి గుర్తులు పోస్ట్ చేసిన ప్ర‌కాశ్ రాజ్
  • 2004లో నంది అవార్డు అందుకున్నానని వ్యాఖ్య‌
  • వైఎస్సార్‌, దాస‌రితోనూ ఫొటోలు
prakash raj shares pics
'తీపి గుర్తులు' అంటూ 2004లో నంది అవార్డు అందుకున్న నాటి ఫొటోను సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ పోస్ట్ చేశారు. అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డితో పాటు ప‌లువురితో దిగిన ఫొటోల‌ను ఆయ‌న పోస్ట్ చేశారు.
                
'డా.రాజశేఖర్ రెడ్డి గారు, డా.దాసరి నారాయణరావు గారు.. డా.గుమ్మడి గారి ఆ స్పర్శ ఆహా' అంటూ ప్ర‌కాశ్ రాజ్ పేర్కొన్నారు. కాగా, ప్ర‌కాశ్ రాజ్ త‌న కెరీర్‌లో ఎనిమిది నంది అవార్డులు అందుకున్నారు.  దేశంలోని ప‌లు భాష‌ల చిత్రాల్లో న‌టించి మెప్పించారు.