మొన్న మమ్ముట్టికి.. ఇప్పుడు ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ కు కరోనా!

21-01-2022 Fri 13:34
  • తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయన్న దుల్కర్
  • ప్రస్తుతం ఇంట్లో ఐసొలేషన్ లో ఉన్నానని వెల్లడి
  • తనను కలిసిన వారు కొవిడ్ టెస్టులు చేయించుకోవాలన్న దుల్కర్
Dulquer Salmaan tests positive for corona
మలయాళ సీనియర్ సినీ నటుడు మమ్ముట్టి ఇటీవలే కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయన కుమారుడు, యువ హీరో దుల్కర్ సల్మాన్ కు కరోనా సోకింది. సోషల్ మీడియా ద్వారా దుల్కర్ ఈ విషయాన్ని తెలిపాడు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ప్రస్తుతం ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నానని చెప్పాడు.

స్వల్ప కొవిడ్ లక్షణాలు మినహా అంతా బాగానే ఉందని తెలిపాడు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ ఐసొలేషన్ లో ఉండాలని, కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరాడు. కరోనా ఇంకా మనల్ని వదిలి పెట్టలేదని... అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మాస్కులు కచ్చితంగా ధరించాలని చెప్పాడు.