16 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా కన్న తండ్రి, తోడబుట్టిన అన్న అత్యాచారం

21-01-2022 Fri 13:26
  • దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణ ఘటన
  • చెల్లెలికీ ఇలాగే జరుగుతుందని భయపడి టీచర్ కు చెప్పిన బాలిక
  • స్వచ్ఛంద సంస్థ సాయంతో పోలీసులకు ఫిర్యాదు
Father and Sibling Raped Minor For 2 Years
ఓ 16 ఏళ్ల బాలికపై కన్న తండ్రి, తోడబుట్టిన అన్న రెండేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. ఘటనకు సంబంధించి బాధితురాలి తండ్రి, అన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.

తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని ఆ పదో తరగతి అమ్మాయి తన స్కూలు టీచరు, ప్రిన్సిపాల్ కు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్కూలు యాజమాన్యం ఓ స్వచ్ఛంద సంస్థకు విషయాన్ని చెప్పారు. వారి సాయంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

2019 జనవరిలో మొదటిసారి 43 ఏళ్ల తన తండ్రి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో తెలిపింది. ఆ తర్వాత అదే నెలలో తన అన్న కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.

తన చెల్లెలిపైనా ఇదే తరహాలో లైంగిక దాడి చేస్తారేమోనని భయం వేసిందని, అందుకే తనకు జరిగిన అన్యాయాన్ని టీచర్ కు తెలియజేశానని బాధితురాలు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.