చాలా అవ‌మానాలు ఎదుర‌య్యాయి!: హీరోయిన్ కృతి స‌న‌న్

21-01-2022 Fri 13:21
  • నా పెదవులు చిన్నగా ఉన్నాయనేవారు
  • బాగా లిప్‌స్టిక్‌ రాసి కవర్ చేసుకోవాల‌ని చెప్పేవారు
  • ముక్కు పుటలు బాగా పైకి వస్తున్నాయనేవారు
  • నడుము సైజ్‌ బాగా తగ్గించుకోవాలని కొంద‌రు చెప్పేవారన్న కృతి 
kriti sanan comments in film industry
సినీ కెరీర్‌లో త‌న‌కు పలు అవ‌మానాలు ఎదురయ్యాయని వాపోతోంది హీరోయిన్ కృతి స‌న‌న్. తాజాగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ...  త‌న‌ పెదవులు చిన్నగా ఉన్నాయని, బాగా లిప్‌స్టిక్‌ రాసి కవర్ చేసుకోవాల‌ని కొంద‌రు చెప్పేవారని తెలిపింది. నవ్వుతోన్న స‌మ‌యంలో ముక్కు పుటలు బాగా పైకి వస్తున్నాయని, గ‌ట్టిగా న‌వ్వకూడ‌ద‌ని మ‌రికొంద‌రు చెప్పేవార‌ని వ్యాఖ్యానించింది.

అలాగే, నడుము సైజ్‌ బాగా తగ్గించుకోవాలని కొంద‌రు అనేవార‌ని తెలిపింది. అయితే, ఈ అవమానాలే త‌నలో కసిని పెంచాయని, త‌న లోపాలపై కాకుండా బలాలపై దృష్టి పెట్టాన‌ని కృతి స‌న‌న్ చెప్పుకొచ్చింది. సినిమాల్లో మంచి కథలను ఎంచుకొని నటిగా నిరూపించుకున్నాన‌ని తెలిపింది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా శారీరక రూపాన్ని మార్చుకోవడానికి మ‌హిళ‌లు అంటే ప్లాస్టిక్‌ బొమ్మలు కాదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కృతి స‌న‌న్.. ప్రభాస్‌ సరసన 'ఆదిపురుష్' సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.