జగన్ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్.. ఈ నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్!

21-01-2022 Fri 12:43
 • కొత్త పీఆర్సీకి ఆమోదం తెలపనున్న కేబినెట్
 • ఉద్యోగ విరమణ వయసుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
 • ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకాన్ని ఆమోదించనున్న కేబినెట్
AP cabinet meeting is going on
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. కేబినెట్ భేటీ అజెండాలోని ప్రధాన అంశాలు ఇవే.

 • ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీకి ఆమోదం
 • ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడానికి ఆమోదం
 • కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై చర్చ
 • ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి ఆమోదం
 • జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయింపు
 • ప్లాట్ల ధరలో ఉద్యోగులకు 20 శాతం రాయితీ, ప్లాట్ల కేటాయింపులో పెన్షనర్లకు 5 శాతం కేటాయింపుకు ఆమోదం
 • వృద్ధాప్య పెన్షన్లను రూ. 2,250 నుంచి రూ. 2,500కు పెంచడానికి ఆమోదం
 • ఈబీసీ నేస్తం అమలుకు ఆమోదం
 • వీటితో పాటు మరిన్ని ఇతర అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.