Ajith: హైదరాబాద్ పై ఆసక్తి చూపుతున్న అజిత్!

Ajith in Vinod Movie
  • అజిత్ తాజా చిత్రంగా 'వలిమై'
  • సంక్రాంతికి రావలసిన సినిమా 
  • కరోనా కారణంగా వాయిదా 
  • తదుపరి సినిమాకి సన్నాహాలు 
తమిళనాట అజిత్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను .. మాస్ ఆడియన్స్ లోను ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా విడుదలవుతుందంటే, పండుగ వస్తుందన్నట్టుగా అక్కడి అభిమానులు హడావిడి చేస్తుంటారు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావలసిన 'వలిమై' కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇటీవల కాలంలో అజిత్ హైదరాబాద్ పై ఎక్కువ ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. తన సినిమాల షూటింగులు ఇక్కడే జరగాలని ఆయన కోరుకుంటున్నారట. అజిత్ పుట్టి పెరిగింది సికింద్రాబాద్ లోనే. ఆయన 'వలిమై' షూటింగు కూడా ఎక్కువగా హైదరాబాద్ లోనే జరిగింది. ఆ తరువాత సినిమాను కూడా ఆయన ఇక్కడే మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు.

అజిత్ తన తదుపరి సినిమాను కూడా వినోద్ తోనే చేయనున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి కూడా నిర్మాత బోనీ కపూర్ కావడం విశేషం. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Ajith
Vinod
Bony kapoor

More Telugu News