గాళ్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ నిశ్చితార్థం

21-01-2022 Fri 09:35
  • నిన్న 28వ బర్త్ డే జరుపుకున్న అక్షర్ పటేల్
  • గాళ్‌ ఫ్రెండ్ మేహాతో నిశ్చితార్థం
  • పోటెత్తిన శుభాకాంక్షలు
Together and Forever Axar Patel gets engaged to girlfriend on birthday
టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నిన్న 28వ జన్మదినం జరుపుకున్న అక్షర్ దానిని మరింత మధురంగా మార్చుకున్నాడు. గాళ్‌ఫ్రెండ్ మేహాతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. సహచరుడు యుజ్వేంద్ర చాహల్ సహా పలువురు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలతో ఇన్‌స్టాగ్రామ్‌ను మోతెక్కించారు.

అక్షర్ పటేల్ నిశ్చితార్థం విషయాన్ని తొలుత అతడి గుజరాత్ టీమ్మేట్ చింతన్ గాజా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అక్షర్-మేహ నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేశాడు. అక్షర్ మోకాళ్లపై నిల్చుని ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఆ ఫొటో ఉంది. అలాగే, ప్రేమ చిహ్నంతో పాటు ‘మ్యారీ మీ’ అని బ్యాక్‌ గ్రౌండ్‌లో పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉండగా, పూలతో చెక్కిన లవ్ సింబల్‌పై వారిద్దరూ నిల్చున్న ఫొటోలను అక్షర్ పటేల్ షేర్ చేశాడు.