శ్రీకృష్ణుడి వేషంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. ఎన్టీఆర్ శతజయంతి రోజున ఖమ్మం జిల్లాలో ఆవిష్కరణ

21-01-2022 Fri 09:17
  • ఏర్పాటు చేయిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు
  • రూ. 2.3 కోట్ల ఖర్చుతో విగ్రహం
  • తుది దశకు చేరుకున్న పనులు
  • జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ
54 feet NTR Sculpture to be unveil in Khammam
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న 54 అడుగుల విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న ఖమ్మం జిల్లా లకారం చెరువులో దీనిని ఆవిష్కరించనున్నారు.

రూ. 2.3 కోట్ల ఖర్చుతో ఎన్టీఆర్ అభిమానులు దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్‌లో దీనిని తయారుచేస్తుండగా, పనులు తుది దశకు చేరుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించేందుకు అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.