అఖిలేశ్ యాదవ్ పోటీ చేయబోయే స్థానం ఇదే!

20-01-2022 Thu 22:00
  • వచ్చే నెలలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు
  • దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న యూపీ
  • కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న అఖిలేశ్
Akhilesh Yadav to contest from Karhal constituency
వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అక్కడ జరుగుతున్న పరిణామాలను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పిన అఖిలేశ్ యాదవ్... ఎట్టకేలకు మనసు మార్చుకున్నారు. ఆయన ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు పార్టీ వెల్లడించింది. కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ పోటీ చేయనున్నట్టు సమాజ్ వాదీ పార్టీ నేడు ప్రకటించింది.

కర్హాల్ నియోజకవర్గంలో సమాజ్ వాదీ పార్టీకి పెద్ద రికార్డ్ ఉంది. 1993 నుంచి అక్కడ ఎస్పీ అభ్యర్థులే గెలుస్తున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి లక్షకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఈ స్థానంలో అఖిలేశ్ గెలుపు నల్లేరు మీద నడకే కాబోతోంది.