Andhra Pradesh: ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు.. సమ్మె తప్పదు: ఏపీ ఉద్యోగ సంఘాలు

All employees unions uniting to fight against AP govrnment
  • ఒకే తాటిపైకి వస్తున్న అన్ని ఉద్యోగ సంఘాలు
  • రేపు ఉదయం 11.30కి సచివాలయంలో కీలక భేటీ
  • రేపు సీఎస్ కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు

పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ, చర్చల ద్వారా సంప్రదింపులు జరుపుకుని అందరం ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, డిమాండ్లను సాధించుకుంటామని తెలిపారు.

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. రేపు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో సమావేశమవుతున్నామని... అనంతరం తమ విధివిధానాలను వెల్లడిస్తామని తెలిపారు.

మరో నేత సూర్యనారాయణ మాట్లాడుతూ, పర్సనల్ అజెండా, అంతర్గత విభేదాలను పక్కన పెట్టి అందరం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అందరం ఒకే తాటిపైకి వచ్చి ఉద్యమించాలని నిర్ణయించామని తెలిపారు. రేపటి నుంచి ఉద్యోగులందరిదీ ఒకే మాట, ఒకే వాదన అని చెప్పారు.

సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందరం ఐకమత్యంగా ఒకే వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించామని చెప్పారు.

ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ, రేపు సచివాలయంలో సమావేశమై అన్ని డిమాండ్లపై చర్చించనున్నామని తెలిపారు. రేపు సీఎస్ కు సమ్మె నోటీసు ఇస్తామని చెప్పారు. సమ్మెపై వెనక్కి తగ్గే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News