Chiranjeevi: పిక్ ఆఫ్ ది డే.. మెగాస్టార్ తో కలిసి మీసం మెలేసిన నేచురల్ స్టార్!

  • ప్రేక్షకులను ఆకట్టుకున్న 'శ్యామ్ సింగరాయ్'
  • ఈ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి
  • సినిమా ఎంతో నచ్చిందన్న చిరు
Nani with Chiranjeevi pic going viral

నేచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందని చిరు అభినందించారు. అంతేకాదు నానితో కలిసి దిగిన పిక్ ను ఆయన షేర్ చేశారు. ఈ ఫొటోలో ఇద్దరూ మీసాలు మెలేస్తూ, చిరునవ్వులు చిందిస్తుండటం అందరినీ ఆకట్టుకుంటోంది.

క్రిస్మస్ సందర్భంగా 'శ్యామ్ సింగరాయ్' సినిమా విడుదలయింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో సినిమా విడుదలయినప్పటికీ... మంచి వసూళ్లను రాబట్టింది. దేవదాసి వ్యవస్థపై పోరాటం చేసే కథనంతో ఈ చిత్రం తెరకెక్కింది. సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు.

More Telugu News