తెలంగాణలో కొత్తగా 4,207 మందికి కరోనా పాజిటివ్

20-01-2022 Thu 20:12
  • గత 24 గంటల్లో 1,20,215 మందికి కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,645 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 26,633 మందికి చికిత్స
Corona positive for 4207 new people in Telangana
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,215 మందికి కరోనా పరీక్షలు చేయగా... 4,207 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,645 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 380 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 336 కేసులు, హనుమకొండ జిల్లాలో 154 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 107 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 1,825 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,22,403 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,91,703 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 26,633 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,067కి పెరిగింది.