'వీరమల్లు' కోసం మరో భారీ సెట్!

20-01-2022 Thu 18:55
  • 'వీరమల్లు' పాత్రలో పవన్
  • చారిత్రక నేపథ్యంలో నడిచే కథ
  • సంగీత దర్శకుడిగా కీరవాణి
  • ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు      
Hari Hara Veeramallu movie update
పవన్ కల్యాణ్ ఇప్పుడు 'హరి హర వీరమల్లు' సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టనున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఆల్రెడీ 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ఎ.ఎమ్.రత్నం అత్యధిక భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలంలో ఈ కథ నడుస్తుంది.

అందువలన అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, ఆనాటి ప్రసిద్ధమైన కొన్ని కట్టడాలకు సంబంధించిన సెట్లు వేస్తున్నారు. అలా ఓల్డ్ ఢిల్లీకి చెందిన 'చాందినీ చౌక్' సెట్ ను వేయిస్తున్నారట. ఈ సెట్ ఏరియాలో భారీ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టుగా తెలుస్తోంది.

'వీరమల్లు' అనే గజదొంగ పాత్రలో పవన్ కనిపించనున్నారు. అలాగే మోడ్రన్ లుక్ తోను ఆయన ఈ సినిమాలో కనిపిస్తారని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన 'పంచమి' అనే పాత్రలో నిధి అగర్వాల్ అలరించనుంది. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.