మీరా జాస్మిన్ రీ ఎంట్రీ?

20-01-2022 Thu 18:27
  • నిన్నటితరం నాయిక మీరా జాస్మిన్
  • మరిచిపోని తెలుగు ప్రేక్షకులు  
  • ఇకపై ఇన్ స్టాలోను సందడి
  • తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్
Meera Jasmine Re entry
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకప్పుడు రాణించిన కథానాయికలలో మీరా జాస్మిన్ ఒకరు. తెలుగులో ఆమె బాలకృష్ణ .. జగపతిబాబు .. రవితేజ .. పవన్ కల్యాణ్ లతో సినిమాలు చేసింది. అయితే మీరా జాస్మిన్ పేరు వినగానే అందరికీ కూడా 'గుడుంబా శంకర్' సినిమానే గుర్తుకు వస్తుంది.

గ్లామర్ పరంగా .. నటనాపరంగా ఆమెకి మంచి మార్కులే పడ్డాయి గానీ, ఆశించిన స్థాయిలో విజయాలు లభించలేదు. దాంతో సహజంగానే అవకాశాలు ముఖం చాటేశాయి. అప్పటి నుంచి తమిళ .. మలయాళ భాషల్లో ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. అక్కడ ఆమె ఖాతాలో కొన్ని హిట్స్ ఉన్నాయి.

అలాంటి మీరా జాస్మిన్ రీసెంట్ గా ఇన్ స్టా లో అడుగుపెట్టింది. ఇలా ఇన్ స్టాలో ఎకౌంట్ ఓపెన్ చేసిందో లేదో, అలా ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోతోంది. సినిమాలకు .. నా అభిమానులకు మరింత దగ్గర కావడం కోసమే ఇన్ స్టాలో అడుగుపెట్టినట్టుగా ఆమె చెప్పింది. మలయాళంలో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తెలుగులోను రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు.