Pakistan: పాకిస్థాన్ లో బాంబు పేలుడు.. వణికిన లాహోర్!

Bomb blast in Pakistan Lahore
  • లాహోర్ లోని అనార్కలీ మార్కెట్లో బాంబు పేలుడు
  • ఐదుగురి మృతి.. 20 మందికి పైగా గాయాలు
  • పేలుడుకు తామే బాధ్యులమని ప్రకటించిన బలోచ్ నేషనల్ ఆర్మీ
బాంబు పేలుడుతో పాకిస్థాన్ లోని లాహోర్ నగరం దద్దరిల్లింది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే అనార్కలీ మార్కెట్లో బాంబు పేలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలవగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఒక మోటార్ బైక్ కు అమర్చిన టైమ్ కంట్రోల్ బాంబ్ ద్వారా పేలుడుకు పాల్పడ్డారని లాహోర్ పోలీస్ ప్రతినిధి రానా అరీఫ్ తెలిపారు. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పేలుడు ప్రాంతాన్ని పరిశీలించాయి. పేలుడులో పలు మోటార్ బైక్ లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు దాడికి తామే బాధ్యులమని బలోచ్ నేషనల్ ఆర్మీ ప్రకటించుకుంది.
Pakistan
Lahore
Bomb Blast

More Telugu News