జగన్ గారూ.. మీకేంటి అక్కడికెళ్లి కూర్చుంటారు.. ప్రజల పరిస్థితి ఏమిటి?: వర్ల రామయ్య

20-01-2022 Thu 14:57
  • తెలివిలేని సలహాదారులతో సతమతమవుతున్నారుగా
  • ఈరోజు ఉపాధ్యాయులు రోడ్డెక్కారు... రేపు ఇతర ఉద్యోగులు కూడా
  • వారిని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా మారుస్తారా?
Varla Ramaiah comments on Jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య మరోసారి విమర్శలు గుప్పించారు. తెలివిలేని సలహాదారుల సలహాలతో సతమతమవుతున్నారుగా సీఎం గారూ? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈరోజు ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారని, రేపు ఇతర ఉద్యోగులు రోడ్డెక్కుతారని... వారిని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా మారుస్తారా? అని ప్రశ్నించారు. 'మీకేం.. అటూ ఇటూ కాకపోతే అక్కడకు వెళ్లి కూర్చుంటారు... రాష్ట్ర ప్రజల మాటేంటని' ఎద్దేవా చేశారు. ఒక పక్క కరోనా, మరో పక్క అధోగతిలో ఆర్థిక పరిస్థితి... ఇంకేంటి పరిస్థితి అని వర్ల రామయ్య ప్రశ్నించారు.