కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్

20-01-2022 Thu 14:38
  • కరోనా సోకిందన్న విషయాన్ని స్వయంగా వెల్లడించిన కిషన్ రెడ్డి
  • తనలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని వెల్లడి
  • తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన అందరూ టెస్టులు చేయించుకోవాలని సూచన
Union minister Kishan Reddy tests positive for Corona
మన దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. భారత్ తో థర్డ్ వేవ్ కలకలం రేపుతోంది. సామాన్యుడి నుంచి వీఐపీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.

ఈరోజు తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని ఆయన ట్వీట్ చేశారు. తనలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్స్ అన్నింటినీ తాను పాటిస్తున్నానని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. ఇటీవల తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. టెస్ట్ రిపోర్టులు వచ్చేంత వరకు ఐసొలేషన్ లో ఉండాలని సూచించారు.