వల్లభనేని వంశీపై పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

20-01-2022 Thu 15:08
  • చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ విమర్శించలేదు 
  • ఆయనపై విమర్శలు చేసింది వల్లభనేని వంశీ   
  • వంశీకి, వైసీపీకి సంబంధం లేదన్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
Vallabhaneni Vamsi is not connected to YSRCP says Sridhar Reddy
వైసీపీకి అనుకూలంగా ఉంటున్న టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అనంతపురం జిల్లా పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ అనే వాడితో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ విమర్శించలేదని... ఆయనపై విమర్శలు చేసిన వాడు వల్లభనేని వంశీ అనీ... అతనితో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.