కుటుంబ కలహాలే కారణం.. ధనుష్, ఐశ్వర్యలు విడిపోవడంపై నిర్మాత కస్తూరిరాజా స్పందన

20-01-2022 Thu 13:53
  • సాధారణ కుటుంబాల్లో ఉండే గొడవలే
  • నేను ఇద్దరితోనూ మాట్లాడాను
  • సలహాలు కూడా ఇచ్చాను
  • ధనుష్ తండ్రి, నిర్మాత కస్తూరి రాజా వెల్లడి 
Dhanush father Kasthuri Raja said about actors separation from Aishwaryaa Rajinikanth
తన కుమారుడు ధనుష్, కోడలు ఐశ్వర్య విడిపోవడం పట్ల ప్రముఖ తమిళ సినీ దర్శకుడు కస్తూరి రాజా స్పందించారు. కుటుంబ తగాదాల వల్లే వారు విడిపోయినట్టు చెప్పారు. ధనుష్, ఐశ్వర్య (తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె) విడిపోతున్నట్లు గత వారం ప్రకటించడం తెలిసిందే. తమ నిర్ణయంతో కోట్లాది అభిమానులకు వారు షాక్ ఇచ్చారు.

దీనిపై ఓ మీడియా సంస్థతో కస్తూరి రాజా మాట్లాడారు. ‘‘సాధారణ కుటుంబాల్లో మాదిరే ధనుష్, ఐశ్వర్య మధ్య కూడా కలహాలున్నాయి. అవి ముగిసేవి కావు. నేను ఇద్దరితోనూ ఫోన్లో మాట్లాడాను. కొన్ని సలహాలు కూడా ఇచ్చాను’’ అని కస్తూరి రాజా తెలిపారు.

18 ఏళ్ల వివాహ బంధం తర్వాత ఎవరికి వారు తమ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నామని ధనుష్ ప్రకటించడం తెలిసిందే. ఐశ్వర్య, ధనుష్ కు 2004లో వివాహమైంది. వీరి నిర్ణయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.