Aadhaar PVC: మార్కెట్లో లభించే ఆధార్ పీవీసీ కాపీలను వినియోగించొద్దు: యూఐడీఏఐ

  • వాటితో భద్రత ఉండదంటూ ట్వీట్
  • యూఐడీఏఐ నుంచి తీసుకోవచ్చు
  • రూ.50తో ఆన్ లైన్ లోనే దరఖాస్తు  
Aadhaar PVC card from open market not valid

పౌరులు మార్కెట్లో లభించే ఆధార్ పీవీసీ కార్డులను వినియోగించొద్దంటూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సూచించింది. వీటితో భద్రత ఉండదని హెచ్చరించింది. ఈ మేరకు ట్విట్టర్ పేజీపై ఒక పోస్ట్ పెట్టింది.

‘‘బహిరంగ మార్కెట్లో లభించే ఆధార్ పీవీసీ కాపీలను వినియోగించడాన్ని మేము ప్రోత్సహించం. ఎందుకంటే అవేమీ భద్రతా ఫీచర్లను కలిగి ఉండవు. రూ.50 (జీఎస్టీ, స్పీడ్ పోస్ట్ చార్జీలు కలసి) చార్జీ చెల్లించడం ద్వారా ఆధార్ పీవీసీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఇక్కడ https://myaadhaar.uidai.gov.in/genricPVC క్లిక్ చేయండి’’ అంటూ యూఐడీఏఐ ట్వీట్ చేసింది.

యూఐడీఏఐ అధికారికంగా జారీ చేసే ఆధార్ పీవీసీ కార్డు డిజిటల్ సంతకం చేసి, క్యూఆర్ కోడ్ తో, కార్డు దారుడి ఫొటోతో ఉంటుంది. హోలోగ్రామ్, మైక్రో టెక్ట్స్, జారీ చేసిన తేదీ, ప్రింట్ చేసిన తేదీ, ఆధార్ లోగో తదితర సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి.

More Telugu News