రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో 'శ్యామ్ సింగ రాయ్'

20-01-2022 Thu 11:58
  • డిసెంబర్ 24న వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్'
  • నాని సరసన ముగ్గురు కథానాయికలు 
  • నెట్ ఫ్లిక్స్ చేతికి స్ట్రీమింగ్ హక్కులు 
Shyam Singha Roy will stream in Netfilx on Tomorrow
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన 'శ్యామ్ సింగ రాయ్' డిసెంబర్ 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. కలకత్తాలో 70వ దశకంలో కొనసాగిన దేవదాసీ వ్యవస్థ చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ కాలాన్ని ప్రతిబింబిస్తూ భారీ సెట్స్ వేసి ఈ సినిమాను చిత్రీకరించారు.

నాని సరసన సాయిపల్లవి .. కృతిశెట్టి .. మడోన్నా కథానాయికలుగా అలరించారు. నాని రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తే, బెంగాలీ యువతిగా సాయిపల్లవి ఆకట్టుకుంది. ఒక వైపున 'అఖండ' .. 'మరో వైపున 'పుష్ప' భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సమయంలో ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. దాంతో ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందోనని అంతా అనుకున్నారు.

కానీ ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. చాలా కాలం తరువాత నాని ఖాతాలో మరో హిట్ ను జమచేసింది. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు తీసుకున్నారు. రేపటి నుంచి ఈ సినిమాను స్టీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా వదిలారు. ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.