Team India: తొలి వన్డేలో భారత్ పరాజయం

India looses 1st ODI against South Africa
  • 31 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్
  • 50 ఓవర్లలో 4 వికెట్లకు 296 పరుగులు చేసిన సౌతాఫ్రికా
  • 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేసిన భారత్
ఇప్పటికే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ని కోల్పోయిన టీమిండియా... వన్డే సిరీస్ ను కూడా ఓటమితో ప్రారంభించింది. పార్ల్ లో జరిగిన తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అనంతరం 297 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత బ్యాట్స్ మెన్లలో కేఎల్ రాహుల్ 12 పరుగులు, ధావన్ 79, కోహ్లీ 51, రిషభ్ పంత్ 16, శ్రేయస్ అయ్యర్ 17, వెంకటేశ్ అయ్యర్ 2, అశ్విన్ 7, శార్దూల్ ఠాకూర్ 50, భువనేశ్వర్ కుమార్ 4, బుమ్రా 14 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎన్గిడి, షంషీ, పెహ్లూక్వాయోలు చెరో 2 వికెట్లను తీయగా... మార్క్ రామ్, కేశవ్ మహరాజ్ లు చెరొక వికెట్ తీశారు. 129 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ డుస్సేన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
Team India
South Africa
1st ODI

More Telugu News