Somu Veerraju: హిందువుల మనోభావాలు గాయపడేలా ప్రభుత్వ, పోలీసు చర్యలు ఉండకూడదు: సోము వీర్రాజు

Police acts should not damage Hindus sentiments says Somu Veerraju
  • నంద్యాలలో సుజన్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన సోము వీర్రాజు  
  • ఆయన కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్న వీర్రాజు
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడేది పోలీసు, రెవెన్యూ వ్యవస్థలేనని వ్యాఖ్య
కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటనపై ప్రభుత్వం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నంద్యాలలో ఈరోజు ఆయన సుజన్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, హిందువుల మనోభావాలను గాయపరిచేలా ప్రభుత్వ, పోలీసుల చర్యలు ఉండకూడదని అన్నారు.

సుజన్ రాజు కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజకీయ పార్టీ ద్వారా ఏర్పడే ప్రభుత్వం కాదని... ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలదే ప్రధాన పాత్ర అని చెప్పారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు గాడి తప్పితే ప్రజాస్వామ్యానికి దెబ్బ తగులుతుందని అన్నారు.
Somu Veerraju
BJP
Sujan Raju

More Telugu News