చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: చైనా రాయబారి లేఖ

19-01-2022 Wed 16:47
  • కరోనా బారిన పడ్డ చంద్రబాబు
  • హోం ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స  
  • చంద్రబాబుకు లేఖ రాసిన సున్ వెయిడాంగ్
China ambassador writes letter to Chandrababu wishing him speedy recovery from Corona
టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు ఆకాంక్షించారు. తాజాగా చంద్రబాబుకు భారత్ లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాశారు. కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలని లేఖలో ఆయన ఆకాంక్షించారు. మరోవైపు చంద్రబాబు హోం ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయనలో కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఆయన తర్వగా కోలుకోవాలని టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నాయి.