వేకువ జామున 3 నుంచి 4 గంటల దాకా పిల్లలకు హోం వర్క్ చేయించేదాన్ని: ప్రియాంక గాంధీ

19-01-2022 Wed 14:15
  • ఫేస్ బుక్ లైవ్ లో యూజర్లతో సరదా వ్యాఖ్యలు
  • తన పిల్లలతో పాటు వారి ఫ్రెండ్స్ హోం వర్క్ కూ సాయం చేసేదాన్ని
  • చిన్నప్పుడు రాహుల్ తో బాగా ఫైటింగ్ చేసేదాన్నన్న ప్రియాంక 
Priyanka Gandhi Says That She Helps Her Children Home Work Done
పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, పిల్లల హోం వర్క్ కోసం తాను సాయం చేస్తానని ప్రియాంక గాంధీ వాద్రా చెప్పారు. ఫేస్ బుక్ లైవ్ లో భాగంగా పలువురు యూజర్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. కేవలం తన పిల్లల హోం వర్క్ కోసమే కాకుండా ‘ఆంటీ’ అనుకుంటూ వచ్చే వారి స్నేహితుల హోం వర్క్ లోనూ సాయపడతానన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా సెషన్ ను స్టార్ట్ చేయడానికి ముందు కూడా తన కూతురు అసైన్ మెంట్ కు హెల్ప్ చేశానన్నారు.

కొన్నికొన్నిసార్లు ఎన్నికల ప్రచారం నుంచి ఆలస్యంగా వస్తే.. వేకువజామున 3 నుంచి 4 గంటల వరకూ పిల్లలతో హోం వర్క్ చేయించేదానినని తెలిపారు. తన చిన్నప్పుడు తన అన్న రాహుల్ గాంధీతో తీవ్రంగా పోట్లాడేదాన్నని గుర్తు చేసుకున్నారు. తమ ఇంట్లో నిర్ణయాలు తీసుకోవడం విషయంలో భయంకరమైన ప్రజాస్వామ్యవాదం ఉండేదన్నారు.