నీలాంటి కొడుకుంటే జన్మ ధన్యమైనట్టే.. వరుణ్ తేజ్ కు నాగబాబు, చిరంజీవి విషెస్.. గని నుంచి స్పెషల్ గ్లింప్స్

19-01-2022 Wed 13:23
  • 32వ పడిలోకి మెగా ఫ్యామిలీ వారసుడు
  • తృప్తికరమైన ఫీలింగ్ ను ఇచ్చావన్న నాగబాబు
  • ఈ ఏడాదంతా బాగుండాలన్న చిరంజీవి
Mega Family Heir Varun Gets Wishes From Father and His Big Father
మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్ ఇవాళ 32వ పడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన తండ్రి నాగబాబు ఎమోషనల్ మెసేజ్ ఇస్తే.. పెదనాన్న చిరంజీవి శుభాశీస్సులు అందించారు.

 
‘‘ఏ తల్లిదండ్రులకైనా నీ లాంటి తనయుడుంటే జీవితం మొత్తం ధన్యమైపోయినట్టే. నువ్వు మాకు అలాంటి తృప్తికరమైన ఫీలింగ్ నే ఇచ్చావు. దానిని మాటల్లో వర్ణించలేను. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంపిక చేసుకున్నందుకు, మా జీవితాలను అందంగా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్ డే వరుణ్’’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.  

హ్యాపీ బర్త్ డే వరుణ్ అంటూ చిరంజీవి విషెస్ చెప్పారు. ఈ ఏడాదంతా బాగుండాలని, మళ్లీ మళ్లీ నువ్వు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాగా, వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ‘గని’ చిత్ర యూనిట్ స్పెషల్ గ్లింప్స్ ను విడుదల చేసింది. కొంత మంది పుట్టాక ఫైటర్లవుతారు.. గని మాత్రం పుట్టుకతోనే ఫైటర్ అని పేర్కొంటూ పవర్ ప్యాక్డ్ గ్లింప్స్ ను వదిలింది. ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తుండగా.. సిద్ధూ ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.